రేవంత్ కు షాకిచ్చిన ఎమ్మెల్యేలు…!

MLAs who shocked Revanth…!
8 total views , 1 views today
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలో శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎంపీలు.. ఎమ్మెల్సీలు అందరూ హాజరయ్యారు. అయితే త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో స్థానం ఆశిస్తున్న పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు మాత్రం హాజరు కాలేదు.
మంత్రి కోమటీరెడ్డి వెంకటరెడ్డి విదేశాల్లో ఉండటంతో ఆయన రాలేకపోయారు. ఈ ముగ్గురు గత కొంతకాలంగా మంత్రివర్గ విస్తరణలో స్థానం కోసం పలుమార్లు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. నిన్న కాక మొన్న డిప్యూటీ సీఎం భట్టీ సమక్షంలోనే ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్, వివేక్ ఒకరిపై ఒకరూ నిప్పులు చల్లుకున్నంత పనిలో విమర్శలు ప్రతివిమర్శలు చేసుకున్నారు.
ఇక రాజగోపాల్ రెడ్డి సంగతి అయితే వేరే చెప్పనక్కర్లేదు. వీలు చిక్కినప్పుడల్లా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తాజాగా జరిగిన సీఎల్పీ భేటీకి వారు రాకపోవడంతో ఓకింత రేవంత్ రెడ్డి అసహానం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. తమకు మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కాలి. లేకపోతే మేము చేసేది మేము చేస్తామంటూ సంకేతాలను సీఎం కు పంపడానికే సీఎల్పీ భేటీకి ఢుమ్మా కొట్టారని కాంగ్రెస్ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నారు.
