నువ్వు ఎంపీవా..? వార్డు మెంబర్వా..?- ఎంపీకి రేవంత్ క్లాస్..!

Are you an MP..? Are you a ward member..?- Revanth’s class for an MP..!
శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో జరిగిన సీఎల్పీ మీటింగ్ లో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లాస్ పీకినట్లు తెలుస్తుంది. మంత్రివర్గ విస్తరణ గురించి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ” రోజుకో ఎమ్మెల్యేకి మంత్రి పదవి వస్తుందంటూ ప్రకటనలు చేస్తూ ఉంటారు. గతంలో ఎమ్మెల్యే కోమటీరెడ్డి రాజగోపాల్ రెడ్డి భువనగిరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి పని చేశారు.
వారికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాజాగా మరో ఎమ్మెల్యే గురించి మాట్లాడుతూ కులం ప్రాతిపదికన చూస్తే సదరు ఎమ్మెల్యేకివ్వాలని అన్నారు. సీఎల్పీ భేటీ లో వీటి ప్రస్తావన వచ్చినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడూతూ మీరు ఎంపీ అన్న సంగతి గుర్తు పెట్టుకోండి.
మీరు వార్డు మెంబర్ కాదు. నోటికి ఏది వస్తే అది మాట్లాడటానికి. మంత్రివర్గ విస్తరణ ఇటు సీఎం పరిధిలో.. అటు జాతీయ నాయకత్వ పరిధిలోని అంశం. ఈ అంశం గురించి ఎవరూ ఎక్కడ బయట మాట్లాడోద్దు. గీత దాటితే వేటే అంటూ సదరు ఎంపీకి క్లాస్ పీకినట్లు టాక్.
