ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పై విచారణ వాయిదా..!

బీఆర్ఎస్ నుండి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్ ను ఆదేశించాలని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్.. హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్లు వేశారు.
దీనిపై దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు ఇవాళ విచారించింది. ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల పద్దెనిమిదో తారీఖుకు వాయిదా వేసింది. విచారణలో భాగంగా పీపీ రీజనబుల్ టైం కావాలని అడిగారు. రీజనబుల్ టైం అంటే ఏంటీ పది నెలలు.. ఏడాది ఆగడమా అని ప్రశ్నించింది.
