బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు ఫిరాయింపు ఎమ్మెల్యేలు..!

ఈనెల ఇరవై ఏడో తారీఖున బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు ఉమ్మడి వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరగనున్న సంగతి తెల్సిందే. పార్టీ ఏర్పడి ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈసారి వేడుకలను చాలా ఘనంగా జరుపుకోవాలని గులాబీ దళపతి.. మాజీ సీఎం కేసీఆర్ వ్యూహారచనలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఎర్రవల్లి ఫామ్ హౌజ్ లో రోజుకో జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ చర్చోపచర్చలు చేస్తూ మార్గదర్శకం చేస్తున్నారు.
ఈ క్రమంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు కొంతమంది తిరిగి తమ గూటికి రావాలని ప్రయత్నాలు చేసిన సంగతి మనకు తెల్సిందే. తాజాగా ఈ వేడుకలను అడ్డం పెట్టుకుని తాము పార్టీ మారలేదు. మేము బీఆర్ఎస్ లోనే ఉన్నాము అని నిరూపించుకునే సదావకాశం వచ్చిందని అనుచరుల దగ్గర.. ముఖ్యుల దగ్గర చర్చిస్తున్నారంట. రజతోత్సవ వేడుకలకు మనం కూడా వెళ్తే ఎలా ఉంటుంది. ఇటు బీఆర్ఎస్ శ్రేణుల్లో అటు ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాలు వెల్లువడుతాయి.
మనకు ఇది ప్లస్ అవుతుందా..?. మైనస్ అవుతుందా అని తనకు తెల్సిన ముఖ్యులతో సర్వే చేయించుకున్నారంట. అంతేకాకుండా పార్టీలో నంబర్ టూ స్థానంలో ముఖ్య నాయకుడితో భేరసారాలు నడుపుతున్నారంట. గతంలో పలుమార్లు ఆ ముఖ్య నేత ఇంటికెళ్లి బ్రతిమిలాడుకున్న ఎమ్మెల్యేలు కోందరూ ఈసారి కేసీఆర్ ను కలవడానికి అపాయింట్మెంట్లు ఇప్పించాల్సిందిగా కోరుతున్నారు అంట. ఇప్పటికే పార్టీ మారి చాలా తప్పు చేశాము.
ఫిరాయింపుల కేసు కోర్టులో ఉంది. అనర్హత వేటు పడటం ఖాయం. ఒకవేళ ఉప ఎన్నికలకెళ్తే ప్రస్తుత పార్టీ తరపున నిలబడితే గెలుపు సంగతి అటుంచి కనీసం డిపాజిట్లు కూడా దక్కవని తమకు చెందిన ఏజెన్సీలతో చేయించిన సర్వేల్లో తేలిందంట. అందుకే ప్రస్తుతం గులాబీ పండుగను అడ్డం పెట్టుకుని మళ్లీ గులాబీ బాస్ కు దగ్గరవ్వాలని ఆరాటపడుతున్నారంట. మరి పార్టీ మారిన నేతలను చేర్చుకునే ప్రసక్తి లేదన్న గులాబీ బాస్ వీరి రాకను ఆహ్వానిస్తారో.. లేదో చూడాలి ..?
