డ్రగ్స్ తీసుకుంటున్న ఎమ్మెల్యే…!

India Loss The Match
తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ కు చెందిన వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ” మీడియా సమావేశంలో చీరలు.. గాజులు చూపించడం దమ్ము కాదు..
దమ్ముంటే నార్కోటిక్ పరీక్షలు చేయించుకొవాలి. ఆ పరీక్షల ఫలితాలను మీడియా సమావేశం పెట్టి మరి ప్రకటించారు. మీరు డ్రగ్స్ తీసుకుంటారు. అందుకే అలా మాట్లాడుతున్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్ .
2014,2018లో మా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను చేర్చుకుంది మీరు కాదా..?. కాంగ్రెస్ నుండి గెలుపొంది మీ పార్టీలో చేరిన సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి ఎలా ఇస్తారు.. టీడీపీ నుండి వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఎలా ఇస్తారు .. అని ఆయన ప్రశ్నించారు.