మరో వివాదంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి..!

బీఆర్ఎస్ నుండి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన పఠాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో అసలు సిసలైన కాంగ్రెస్ నేతలు.. కార్యకర్తలను తొక్కేస్తున్నారు అని విమర్శలు ఉన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మరోకసారి వివాదంలో చిక్కుకున్నారు.
కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అనుచరుడు యాదగిరి నామినేషన్ దాఖలు చేశారు.ఈ నామినేషన్ కార్యక్రమంలో సాక్షాత్తు ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డి పాల్గోనడం విశేషం.
మరోవైపు ఇప్పటికే అభ్యర్థిని కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించిన నేపథ్యంలో ఇలా చేయటం ఏంటని కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం మండిపడుతున్నది. దీంతో మరోసారి మహిపాల్ రెడ్డిపై ఫిర్యాదుకు సిద్ధమైనట్లు వార్తలు విన్పిస్తున్నాయి.
