మంత్రులు ఉత్తమ్ ,జూపల్లి కి షాక్

N Uttam Kumar Reddy Jupally Krishna Rao
మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో ఉన్న మంత్రులు జూపల్లి కృష్ణరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు చేదు అనుభవం ఎదురైంది. జిల్లాలోని ఉదండాపూర్ రిజర్వాయర్ ను పరిశీలించేందుకు స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు లు వెళ్లారు.
ఈ క్రమంలో రిజర్వాయర్ బాధితులు తమకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.తమకు ఇచ్చిన హామీ ప్రకారం నష్టపరిహారం ఇస్తామని చెప్పారు.. ఇచ్చిన హామీని నెరవేర్చాలని బాధితులు ఎదురుతిరిగారు. దీంతో ఎమ్మెల్యే అనిరుధ్ బాధితులతో గొడవకు దిగారు.