సీఎం రేవంత్ కు షాకిచ్చిన మంత్రి ..!
![సీఎం రేవంత్ కు షాకిచ్చిన మంత్రి ..!](https://www.singidi.com/wp-content/uploads/2025/02/Revanth-Reddy-1-850x560.jpg)
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ కాంగ్రెస్ లో ఇంకా అసమ్మతి సెగలు చల్లారినట్లు లేదు. ఇప్పటికే పదిమంది ఎమ్మెల్యేల భేటీ వ్యవహారం ఢిల్లీకి చేరింది. తాజాగా మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి నేతృత్వంలోని ఎమ్మెల్యేలు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడైన మల్లిఖార్జున ఖర్గేను కలిసినట్లు వార్తలు వస్తున్నాయి.
అసలు విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలు ఇంకా చల్లారినట్లులేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా బెంగుళూరులో ఏఐసీసీ అధ్యక్షుడైన ఖర్గేను మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కలిశారు.
ఈ భేటీలో తనకు ప్రాధాన్యం లభించడం లేదు.. బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేను తీసుకొస్తే కనీసం సహకరించడం లేదని మంత్రి జూపల్లి వాపోయినట్లు సమాచారం.. రేపు సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షి మీటింగ్ ఉంది.
కానీ ఈరోజు బెంగుళూరులో కృష్ణ, తుంగభద్రకు నీటి విడుదల విషయమై వెళ్లి ఖర్గేను కలిసి మంత్రి జూపల్లి గోడు వెళ్లబోసుకున్నరు అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గద్వాల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకి కాకుండా సరితా తిరుపతయ్యకు ప్రాధాన్యం ఇస్తున్నారు.. ఉప ఎన్నికలు వస్తే తన పరిస్థితి ఏమిటని బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఖర్గే దగ్గర వాపోయారు.
![](https://www.singidi.com/wp-content/uploads/2024/12/E-Paper-Coming-Soon.png)