జైనూర్ ఘటనపై మంత్రి సీతక్క సీరియస్

Minister Seethakka
తెలంగాణ రాష్ట్రంలోని ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ లో ఆదివాసి మహిళపై లైంగిక దాడి జరిగిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం బాధితురాలు హైదరాబాద్ లో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నారు. గాంధీలో ఉన్న బాధితురాల్ని పరామర్శించడానికి మంత్రి సీతక్క వెళ్లారు.
వెళ్లిన క్రమంలో బీజేపీ నేతలు మంత్రి సీతక్కను అడ్డుకున్నారు. బాధితురాల్ని పరామర్శించిన మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ ” జైనూర్ ఘటనలో నింధితులను ఎవర్ని వదిలిపెట్టము. అందర్నీ కఠినంగా శిక్షిస్తాము. బాధితురాలికి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటాము.
బాధితురాలికి తక్షణ పరిహారం కింద లక్ష రూపాయలు అందించాము” అని తెలిపారు. అయితే ఈ సంఘటన గత ఆగస్టు నెల ముప్పై ఒకటో తారీఖున జరిగితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఆదివాసీ వర్గం జిల్లా బంద్ కి పిలుపునిచ్చారు. దీంతో జైనూర్ లో 144సెక్షన్ పెడుతున్నట్లు డీజీపీ ప్రకటించారు.