జూడా లకు మద్ధతుగా మంత్రి సీతక్క

Minister Seethakka in support of Doctors
కోల్ కత్తాలో ట్రైనీ వైద్యురాలిపై జరిగిన హత్యచారానికి నిరసనగా… బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలనే డిమాండ్ తో తెలంగాణ రాష్ట్ర జూడాల సంఘం ఈరోజు బుధవారం ఓపీ సేవలను బంద్ పెట్టి నిరసనలకు పిలుపునిచ్చిన సంగతి తెల్సిందే.. దీంతో జూడాలు ఈ రోజు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవలను నిలిపివేశారు.
జూడాల నిరసనలకు మంత్రి సీతక్క సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ” తెలంగాణ రాష్ట్రంలోని వైద్యులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుంది. మహిళలకు అన్యాయం జరగదు. మహిళలకు ఎవరూ అన్యాయం చేసిన సహించేది లేదు. ప్రతి ఒక్క మహిళ రక్షణే ధ్యేయంగా మా ప్రభుత్వం పని చేస్తుంది.
కోల్ కత్తాలో జరిగిన సంఘటన హేయం.. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగాలి.. నిందితులకు శిక్ష పడాలి. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుడదంటే కఠినంగా నిందితులను శిక్షించాల్సిందే. తెలంగాణలో జూడాలు చేస్తున్న నిరసన కార్యక్రమానికి మా తరపున మద్ధతు తెలుపుతున్నాము” అని అన్నారు.