వాళ్లపై క్రిమినల్ కేసులు

Ponnam Prabhakar
తెలంగాణలో అద్దె భవనాల్లో ఉన్న గురుకులాలకు తాళాలు వేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సంబంధితాధికారులను ఆదేశించారు. పాత బకాయిలతో సహా మెస్ ఛార్జీలను కూడా మూడు రోజుల క్రితమే చెల్లించామని ఆయన తెలిపారు.
ఎక్కడైన భవన యజమానులు ఇబ్బందులు పెడితే గురుకులాల ప్రిన్సిపల్ లు స్థానిక పోలీస్ స్టేషన్లలో పిర్యాదు చేయాలి. సదరు యజమానులపై క్రిమినల్ కేసులు పెట్టి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
గురుకుల భవనాలకు చెల్లించాల్సిన బకాయిలు గత పది నెలలకు సంబంధించినవి కావు. అవి గత మూడు ఏండ్లవి .. బీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన బకాయిలు అని గుర్తు చేశారు.
