నమ్ముకున్న వారికి అండగా మంత్రి పొంగులేటి
ఆయనో మంత్రి.. గత అధికార పార్టీ బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడంలో కీలక పాత్ర పోషించిన నాయకుడు. అంగబలం.. ఆర్ధబలం మెండుగా ఉన్నవాడు. అందుకే ఆయనకు ప్రస్తుత ప్రభుత్వంలో అత్యంత కీలకమైన రెవిన్యూ శాఖ మంత్రి పదవిచ్చారు. ఆయనే పాలేరు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే .. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. తాజాగా తనకు పదవులేనప్పుడు అండగా ఉన్నాడు.
తనతో నడిచాడు అనే ఒకే ఒక్కకారణంతో అతన్ని పరామర్శించడానికి ఏకంగా ఇంటికే వెళ్లారు. అసలు విషయానికి వస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఖమ్మం రూరల్ మండలం వెంకటాయపాలెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువనేత.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభిమాని ఇటీవల జరిగిన ఓ ప్రమాద సంఘటనలో తన కాళ్లకు తీవ్రగాయలై చికిత్స పొంది ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు.
ఈ విషయం తెల్సిన మంత్రి శ్రీనివాస్ రెడ్డి అందరిమాదిరిగా ఫోన్ లో పరామర్శించకుండా ఏకంగా ఇంటికెళ్లి యోగక్షేమాలపై ఆరా తీశారు. ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకుని . ఆధైర్యపడోద్దు.. అండగా ఉంటాను అని స్వయంగా హామీచ్చి వచ్చారు. ఈ సంఘటనపై కాంగ్రెస్ అభిమానులు.. పోంగులేటి అభిమానులు ఇలాంటి నాయకులు ఉండటం మా ఆదృష్టం.. వారి బాటలో నడవడం మా బాధ్యత అని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.