అందరికీ రుణమాఫీ కాలేదు-మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ మరియు ఐఎన్ పీఆర్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో రుణమాఫీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 22లక్షల మంది రైతులకు రూ.18000వేల కోట్ల రుణమాఫీ చేశాము.. కొంతమందికి కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల రుణమాఫీ కాలేదు..
బీఆర్ఎస్ చెబుతున్నట్లుగా కొంతమందికి రుణమాఫీ కాలేదు..త్వరలోనే వాళ్ల సమస్యలను సైతం పరిష్కరించి రుణమాఫీ చేస్తాము..మేము చేసింది చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు..