సీఐ కుర్చిలో మంత్రి కొండా సురేఖ

Konda Surekha Minister Of Telangana
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మరో వివాదంలో చిక్కుకున్నారు. దసరా పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లేక్సీ లో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఫోటో లేకపోవడంతో ఆయన అనుచరులు మంత్రి కొండా సురేఖ అనుచరులతో గొడవకు దిగారు.
దీంతో పోలీసులు మంత్రి కొండా సురేఖ అనుచరులను అరెస్ట్ చేసి గీసుకోండ పీఎస్ కు తరలించారు. మంత్రి కొండా సురేఖ హుటాహుటిన గీసుకొండ పీఎస్ కు చేరుకుని సీఐ కుర్చిలో కూర్చోని తన అనుచరులను ఎలా అరెస్ట్ చేస్తారని పోలీసు అధికారులను నిలదీశారు.
మంత్రి కొండా సురేఖ సీఐ కుర్చిలో కూర్చున్న ఫోటోలను నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఓ మంత్రి అయి ఉండి సీఐ కుర్చిలో ఎలా కూర్చుంటారంటూ ట్రోల్స్ చేస్తున్నారు.
