రాజకుటుంబం వారసుడిగా మాజీ క్రికెటర్ జడేజా

1500 policemen who raided 4 villages and arrested many people overnight…?
గుజరాత్ రాష్ట్రంలోని జామ్ నగర్ రాజకుటుంబానికి తదుపరి వారసుడిగా టీమిండియా మాజీ స్టార్ ఆటగాడు అజయ్ జడేజా(53) ను నిన్న శనివారం ప్రకటించారు. దీనిపై ప్రస్తుత మహారాజ జాం సాహెబ్ శత్రు సల్వ సింహ్ జీ దిగ్విజయ్ సింహ్ జీ జడేజా అధికారక ప్రకటన చేశారు.
రాజకుటుంబ వారసుడిగా అజయ్ జడేజా అంగీకరించారు. జామ్ నగర్ తర్వాత జాం సాహెబ్ గా బాధ్యతలను అజయ్ జడేజా స్వీకరించడం ఇక్కడి ప్రజలకు ఓ వరం అని శత్రు సల్వ సింహ్ జీ దిగ్విజయ్ సింహ్ జీ జడేజా పేర్కొన్నారు.
మరోవైపు జడేజా 1992నుండి 2000వరకు క్రికెట్ లో తనదైన ముద్ర వేశారు. భారత్ తరపున ఆయన పదిహేను టెస్ట్ మ్యాచులు.. 196 వన్డే మ్యాచ్ లు ఆడారు. రంజీ ట్రోపీ, దులీప్ ట్రోపీ మ్యాచు లకు జడేజా కుటుంబ సభ్యులైన కేఎస్ రంజిత్ సింహ్ జీ, కేఎస్ దులీప్ సింహ్ జీ పేర్లు పెట్టారు.
