మంత్రి జూపల్లి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర పర్యాటక ,సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ” ప్రభుత్వ భూములను,పేదల భూములను ఆక్రమించుకుని నిర్మించుకున్న అక్రమణ దారులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటూ ” సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీలో మీడియా సమావేశంలో పాల్గోన్న మంత్రి జూపల్లి మాట్లాడుతూ ” గత బీఆర్ఎస్ సర్కారు తప్పిదాల వల్లనే ప్రభుత్వ భూములు అణ్యక్రాంతమయ్యాయని ఆరోపించారు. అందుకే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటి పరిరక్షణకై చర్యలు తీస్కుంటుంది.
హైదరాబాద్ లో ఆక్రమణలకు గురైన చెరువులను,భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటుంది . ఒకప్పుడు వేల చెరువులున్న హైదరాబాద్ నగరంలో నేడు వందల చెరువులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీనికి ఎవరూ కారణమైన సరే వదిలే ప్రసక్తే లేదని ఆయన అన్నారు.