నిమ్స్ డైరెక్టర్ కు మంత్రి దామోదర ఫోన్

Damodar Raja Narasimha Health and Medical Cabinet Minister of Telangana
తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ దామోదర రాజనరసింహా నిమ్స్ డైరెక్టర్ కు ఫోన్ చేశారు. కొమురం భీమ్ జిల్లా వాంకిడిలో గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో అరవై మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంగతి తెల్సిందే. వీరిలో ఆరుగురు విద్యార్థినుల పరిస్థితి విషమంగా ఉంది.
చాకటి శైలజ, కుడిమెత జ్యోతి, మహాలక్ష్మి, జ్యోతిలక్ష్మి, భూమిక, లావణ్యల పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ – నిమ్స్ కు తరలించి వైద్యాన్ని అందిస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న మంత్రి దామోదర రాజనరసింహ నిమ్స్ డైరెక్టర్ కు ఫోన్ చేసి మెరుగైన వైద్య సేవలు అందించాలి. అందుకు అవసరమైన అన్ని వసతులను కల్పించాలని ఆదేశించారు. వాంకిడి ఆశ్రమ పాఠశాల పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు.
