పుష్ప -2కు మెగా హీరో మద్ధతు..!
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా నిర్మితమై భారీ అంచనాలతో రిలీజవుతున్న మూవీ ‘పుష్ప-2’..
ఈ సినిమా గురించి మెగా కుటుంబం నుంచి ఎవరూ మాట్లాడట్లేదని నెట్టింట చర్చ జరుగుతోంది. ఈక్రమంలో మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా ‘పుష్ప -2’ టీమ్కు విషెస్ తెలిపారు.
‘అల్లు అర్జున్, సుకుమార్ & టీమ్కు నా హృదయపూర్వక బ్లాక్ బస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు. కాగా, ఈరోజు రాత్రి నుంచి ‘పుష్ప-2’ ప్రీమియర్స్ మొదలు కానున్నాయి.