డిప్రరేషన్ లోకెళ్లిన మీనాక్షి చౌదరి.!
మీనాక్షి చౌదరి విక్టరీ వెంకటేష్ హీరోగా..అనిల్ రావిపూడి దర్శకత్వంలో భీమ్స్ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాము అనే మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెల్సిందే.ఈ మూవీ ఈనెల పద్నాలుగో తారీఖున సంక్రాంతి పండక్కి సినీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ ట్రైలర్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈరోజు సోమవారం సాయంత్రం విడుదల చేశారు..ఈ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ ను షేక్ చేస్తుంది.ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్లో భాగంగా హీరోయిన్ మీనాక్షి చౌదరి ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ కి ఇంటర్వూ ఇచ్చింది.
ఆ ఇంటర్వూలో ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ “విజయ్ నటించిన ‘ది గోట్’ మూవీ తర్వాత తన నటనపై కొందరు ట్రోల్స్ చేయడంతో డిప్రెషన్లోకి వెళ్లానని తెలిపారు. దీని నుంచి కొన్ని రోజులు తేరుకోలేకపోయానని ఆమె చెప్పారు.
‘లక్కీ భాస్కర్’ సక్సెస్ తర్వాత కథల ఎంపికలో జాగ్రత్త వహిస్తున్నానని ఈ అందాల రాక్షసి పేర్కొన్నారు. మరోవైపు ఈ ముద్దుగుమ్మ ‘అనగనగా ఒక రాజు’ సినిమాలో ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తున్నారు.