లండన్ : వృక్షార్చనలో FDC మాజీ చైర్మన్ అనిల్ కుర్మాచలం ..!

తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ జన్మదిన (17, (ఫిబ్రవరి, 2025) శుభసందర్భాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు పార్టీ జనరల్ సెక్రటరీ, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టిన వృక్షార్చనలో కుటుంబసమేతంగా పాల్గొని లండన్ లో మొక్కని నాటిన ఎఫ్దీసి మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం.
తెలంగాణ ప్రదాత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ. కెసిఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి భగవంతుని ఆశీస్సులతో వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్టు అనిల్ కూర్మాచలం తెలిపారు.అందరూ వృక్షార్చనలో పాల్గొని “ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి” విజయవంతం చేయాలని తెలిపారు.
పచ్చదనం కోసం మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ గారు చేస్తున్న కృషి చాలా గొప్పదని, ఇందులో అందరూ భాగస్వాములు అవ్వాలని అనిల్ కోరారు. రాబోయే తరాలు సంతోష్ గారి పేరుని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాయని, “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ఒక చారిత్రాత్మక కార్యక్రమంగా చరిత్రలో నిలిచిపోతుందని అనిల్ కూర్మాచలం తెలిపారు.
