మంత్రిగా లోకేష్ తొలి సంతకం దీనిపైనే..?
ఏపీ రాష్ట్ర విద్య, ఐటీశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన యువనేత నారా లోకేశ్ మెగా డీఎస్సీ విధివిధానాలపై తొలి సంతకం చేశారు.
ఆ ఫైల్ ను ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సమావేశమైన కేబినెట్ కు పంపారు. మంత్రివర్గంలో డీఎస్సీపై చర్చించి, విధివిధానాలపై నిర్ణయం తీసుకున్నారు.
16,347 టీచర్ పోస్టుల భర్తీపై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ లోపు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించడంతో తాజా మంత్రివర్గ సమావేశంలో త్వరగా భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు..