పవన్ కు లోకేశ్ థ్యాంక్స్
ఏపీలో విద్యారంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తున్న మంత్రి నారా లోకేశ్ నాయుడును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. ఇదేవిధంగా ముందుకు సాగాలి. విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలి.. ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించేలా ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు.
మరోవైపు మంత్రి లోకేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలను ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు.. ఈ నిర్ణయంలో భాగంగా విద్యారంగ నిపుణులను వీసీలుగా నియమించాలని ఆయన భావించారు. జాతీయ అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలుగా మార్చేందుకు ప్రణాళికలను రూపొందిస్తూ సంకల్పించారు. తనను అభినందించిన పవన్ ట్వీట్ గురించి లోకేశ్ ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు.
నారా లోకేష్ స్పందిస్తూ ” థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ అన్న అంటూ ఎక్స్ లో రిప్లయ్ ఇచ్చారు.. ఇటు మంత్రి సంధ్యారాణి ఇంట్లో జరిగిన బర్త్ డే వేడుకలను తిరుమలలో జరిగినట్లుగా వైసీపీ చేస్తున్న ప్రచారంపై స్పందిస్తూ జగన్ తన పేటీఎం బ్యాచ్ తో ఫేక్ ప్రచారం చేయిస్తున్నారని దుయ్యబట్టారు. శ్రీవారితో పెట్టుకుంటే వైసీపీకి ఒక్క సీటు కూడా రాదని హేద్దేవా చేశారు.