రేపే రుణమాఫీ
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించిన బ్యాంకు రుణాలకు చెందిన లక్ష రూపాయల వరకు రేపు పద్దెనిమిదో తారీఖున మాఫీ కానున్నాయి..ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఏర్పాట్లను ఇప్పటికే ప్రభుత్వం తయారు చేసింది..మిగతా లక్ష రూపాయలు ఆగస్టు నెలలో మాఫీ కానున్నట్లు ప్రభుత్వం తెలిపింది..
రేషన్ కార్డు ఉన్న లేకపోయిన పాసుబుక్కు ఆధారంగా రుణాలను మాఫీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు కూడా.. రేషన్ కార్డు లేకుండా అర్హులైన రైతులకు కూడా రుణమాఫీ కానున్నది.. రేషన్ కార్డు కేవలం ఆ రైతుకుటుంబంలో ఎంతమంది ఉన్నారు అనేది తెలుసుకోవడానికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియా సాక్షిగా క్లారిటీచ్చారు..
గత ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెండు లక్షల వరకు రైతు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది..డిసెంబర్ తొమ్మిదో తారీఖున మాఫీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఈ రెండు నెలల్లో పూర్తి కావాలని సంబంధితాధికారులను ఆదేశించారు..