రుణమాఫీ కోసం రోడ్డు ఎక్కిన రైతులు
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో అర్భాటంగా చేసిన రూ.2లక్షల రుణమాఫీ చాలా మంది రైతులకు పలుకారణాలతో కాలేదు. దీంతో రైతులు ఆయాచోట్ల రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల అయితే ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్రలు కూడా నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ ,నిజామాబాద్,జగిత్యాల,సిద్దిపేట,ఖమ్మం తదితర జిల్లాల్లో రైతులు రోడ్లపైకి వచ్చి మరి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను తగలబెడుతూ శవయాత్రలు కర్మకాండ సైతం రైతులు నిర్వహించారు.
ఆదిలాబాద్ జిల్లాలో కర్మకాండ కుండలతో మహారాష్ట్ర బ్యాంకులోకి రైతులు దూసుకెళ్లారు. ముఖ్యమంత్రి డౌన్..డౌన్.. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాల వర్షం కురిపించారు. మరోవైపు కరీంనగర్ జిల్లాలో కొత్తపల్లి మండలంలో ఇండియన్ బ్యాంకును రైతులు మూసేశారు.