ఎమ్మెల్సీగా కొదండరామ్ కు లైన్ క్లియర్
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కొదండ రామ్ ,మీర్ అమీర్ అలీఖాన్ లను సిఫారస్ చేస్తూ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి గవర్నర్ తమిళ సైకు ప్రతిపాదనలు పంపిన సంగతి తెల్సిందే. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజ్ శ్రావణ్, కుర్ర సత్యనారాయణను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదనలు పంపారు.
మా నియామకాన్ని కాదని కొదండరామ్ ,మీర్ అమీర్ అలీఖాన్ లను ఎలా నియమిస్తారని బీఆర్ఎస్ నేతలు దాసోజ్ శ్రావణ్,కుర్ర సత్యనారాయణ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్ పై విచారించిన జస్టీస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని బృందం హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై స్టే విధిస్తూ నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.
ఈ సందర్భంగా జస్టీస్ విక్రమ్ నాథ్ బృందం మాట్లాడుతూ కొత్త నియామకాలను చేపట్టోద్దని ఎలా చెప్తాము. అది ప్రభుత్వం,గవర్నర్ హాక్కులను కాలరాయడమే. కొత్త ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు నియామకాలను అడ్డుకోకూడదు అంటూ ప్రతివాదులైన గవర్నర్,ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.