ప్రతి రైతు భూమిని కాపాడుతాం..!
భూభారతి చట్టం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కోటి యాబై రెండు లక్షల ఎకరాలను కాపాడుతాము.. ప్రతి రైతుకు చెందిన భూమికి భద్రత కల్పిస్తాము అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భూభారతి చట్టంపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకోచ్చాము.
గతంలో అద్భుతమని తీసుకోచ్చిన ధరణి చట్టం ద్వారా సామాన్యుల దగ్గర నుండి ప్రముఖుల వరకూ అందరూ అనేక ఇబ్బందులను ఎదుర్కున్నారు. మండల గ్రామ స్థాయిలో పరిష్కారం కావాల్సిన సమస్యలన్నీ కోర్టుల మెట్లు ఎక్కాయి.. లక్షల ఎకరాలు సమస్యల్లో చిక్కుకున్నాయి. అలాంటి ఇబ్బందులకు పరిష్కార మార్గమే భూభారతి చట్టం అని అన్నారు.
సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన సభ్యులు చాలా అమార్యాదగా ప్రవర్తించారు. అయిన చాలా ఓపికతో మీరు ఉన్నారు అని స్పీకర్ ప్రసాద్ కుమార్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ రూల్స్ ను అతిక్రమించింది. పేపర్లను స్పీకర్ పైకి విసిరింది. ప్రధాన ప్రతిపక్ష సభ్యులు చాలా అభద్రతా భావంతో ఉన్నారు. ఈ చర్చను అడ్డుకోవాలని ప్రయత్నించింది. మన ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసింది అని ఆయన అన్నారు.