కొట్లాడుకుందాం..ఫలితాలు ఇంకా దారుణంగా ఉంటాయి ..!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్ధుల్లా ట్విట్టర్ వేదికగా స్పందించారు. మనం ఇలాగే నువ్వా..?. నేనా..? కొట్లాడుకుందాం..?. మనం ఇలాగే కొట్లాడుకుంటే ఫలితాలు ఇంకా దారుణంగా ఉంటాయి.
రెండు కోతులు కలబడుతుంటే మూడో కోతి ఎత్తుకెళ్లినట్లు మనం మనం తన్నుకుంటుంటే బీజేపీ గెలుచుకుంటూ పోతుందని రామాయణం వీడియోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మొత్తం నలబై స్థానాల్లో ఆధిక్యతను కనబరిచింది. ఆప్ పార్టీ ముప్పై స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరోవైపు వరుసగా నాలుగు సార్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒక్కచోట కూడా అధిక్యంలో లేకపోవడం విశేషం.