లగచర్ల తిరుపతి రెడ్డి తాత జాగీరు కాదు…?
కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో భూములను మాత్రమే తీసుకుంటామని చెప్పడానికి ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఎవరూ..?. లగచర్ల భూములు తిరుపతి రెడ్డి జాగీరు కాదు.. ఫార్మా సిటీ ఏర్పాటుకి అవసరమైతే తమ తాతలకు చెందిన భూములను రాసిచ్చుకోవాలని వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెళ్లతో మాట్లాడిన ఆయన గిరిజన రైతుల నుండి భూములను బలవంతంగా తీసుకుంటాము. అడ్డు వస్తే కేసులు పెడతామని చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తక్షణమే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక ప్రజలు ఒప్పుకోకపోతే వేరేచోట ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలి.
తిరుపతి రెడ్డి దాదాగిరీతో.. రౌడీయిజం తో ఇటు కాంగ్రెస్ కు.. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నష్టం చేకూరుతుంది. వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని ఇంటికి పంపడం ఖాయం అని అన్నారు. తండాల మీద తిరుపతి రెడ్డి ఆధిపత్యం అక్రమణలతో రాష్ట్ర వ్యాప్తంగా బయటకు వచ్చిన రోజూ కాంగ్రెస్ నేతలు ఒక్కరూ బయట తిరగలేరు. మీ అన్నదమ్ముళ్లకు గొడవలుంటే ఇంట్లో తన్నుకోండి. అంతేకానీ ప్రజలపై మీ ప్రతాపం చూపిస్తామంటే కాంగ్రెస్ కు నష్టం వాటిల్లుతుంది అని ఆయన అన్నారు.