అల్లు అర్జున్ అరెస్ట్ పై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్..?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీ రామారావు అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించారు.ఇటీవల విడుదలైన పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర నెలకొన్న తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందటంతో పాటు ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.ఈ ఘటనలో ఇప్పటికే ఆ థియేటర్ యజమాన్యం మేనేజర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు.
ఈ సంఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ” జాతీయ అవార్డు గ్రహీతైన అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం పాలకుల చేతకాని తనానికి.. అభద్రత భావానికి పరాకాష్ఠ. తొక్కిసలాటలో మరణించిన మహిళ పట్ల నాకు పూర్తిగా సానుభూతి ఉంది. కానీ నిజంగా ఎవరూ విఫలమయ్యారు?.
అల్లు అర్జున్ లాంటి వ్యక్తిని ఓ సాధారణ నేరస్తుడిగా భావించి ఇలా చేయడం ప్రభుత్వం తీరు మంచిది కాదు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. హైడ్రా వల్ల చనిపోయిన వారి కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బాధ్యుడిగా చేసి అరెస్ట్ చేయాలి అని కేటీఆర్ ట్వీట్ చేశారు.