రేవంత్ రెడ్డి సీట్లో కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కూర్చున్న సీట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు కూర్చోవడం ఖాయం అని అన్నారు మాజీ మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి..
ఓ యూట్యూబ్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నిండు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మీ వెనక కూర్చున్న అక్కలను నమ్ముకుంటే మున్ముందు జూబ్లీ బస్టాండ్ లో అడుక్కోవడమే అని మహిళలను అవమానించడం చాలా బాధాకరం..
నేను రేవంత్ రెడ్డి సీఎం అవుతారని చెప్పా.. మళ్ళీ ఇప్పుడు చెబుతున్న కేటీఆర్ గారు మున్ముందు రేవంత్ రెడ్డి సీట్లో కూర్చోవడం ఖాయం.. ఏడు నెలల్లోనే ఐదెండ్లలో రావాల్సిన వ్యతిరేకత వచ్చింది అని అన్నారు…