ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ సెటైర్..!

KTR
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఇప్పటివరకూ వెలువడిన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో బీజేపీ నలబై ఒక్క స్థానాల్లో ఆధిక్యతను కనబరుస్తుంది. అధికార ఆప్ పార్టీ ఇరవై తొమ్మిది స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. రౌండ్ రౌండ్ కు ఆధిక్యత మారుతూ వస్తుంది.
ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ట్విట్టర్ లో ఆయన స్పందిస్తూ బీజేపీ తరపున గెలిచిన రాహుల్ గాంధీకి అభినందనలు అని ట్వీట్ చేశారు. గతంలో ఇండీయా టుడే లో మాట్లాడిన మాటలను పంచుకున్నారు.
రాహుల్ గాంధీ ఉన్నంతవరకూ బీజేపీని ఓడించడం కాంగ్రెస్ కు సాధ్యమయ్యే పని కాదు. ఇండియాలో మోదీకి అతిపెద్ద కార్యకర్త రాహుల్ గాంధీ. ఇక్కడ ఆయన ఉన్నన్నీ రోజులు మోదీని ఎవరూ ఆపలేరు.. కేవలం ప్రాంతీయ పార్టీలే మోదీని ఆపగలవని పోస్టు చేశారు.
