మెగాస్టార్ పై కొరటాల శివ షాకింగ్ కామెంట్స్

Koratala Siva Shocking Comments On Megastar
ప్రముఖ స్టార్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కి ఈ నెల ఇరవై ఏడో తారీఖున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న మూవీ “దేవర”. ఈ మూవీ గురించి ప్రమోషన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.. తాజాగా యువహీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ ఇంటర్వూలో కొరటాల శివ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆయన మాట్లాడుతూ ” ఫియర్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడుతూ ఎవరికైన భయభక్తులుండాలి.. ఎవరి పని వారు భయభక్తులతో చేస్తే ప్రపంచం అంతటా చాలా ప్రశాంతంగా మంచిగా ఉంటుంది. పక్కవాడి పనిలో చేతులెట్టి గెలకకూడదు అని ఆయన అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు ఆచార్య మూవీని తాకినట్లున్నాయి.ఆచార్య మూవీ కథ విషయంలో హీరో మెగాస్టార్ చిరంజీవి వ్రేలు పెట్టి కథను ఆగం చేశారు.
అందుకే సినిమా ప్లాప్ అయింది. లేకపోతే అప్పట్లోనే కొరటాల శివ మంచి చిత్రాన్ని అందించేవారు అని కొరటాల అభిమానులు అప్పట్లో తెగ ట్రోల్స్ చేశారు. తాజా శివ వ్యాఖ్యలతో ఆచార్య మూవీ కథ విషయంలో మెగాస్టార్ వ్రేలు పెట్టారు.. అందుకే అది ప్లాప్ అయిందని పరోక్షంగా చెప్పినట్లు ఉంది అని ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్పటికే మెగా నందమూరి అభిమానుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటున్న నేపథ్యంలో తాజా వ్యాఖ్యలు దేవర మూవీ పై తీవ్ర ప్రభావం చూపుతాయని అంటున్నారు సినీ క్రిటిక్స్.