కాంగ్రెస్ నుండి కోనేరు కోనప్ప ఔట్..?

సీనియర్ నేత, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీతో అంటీముట్టనట్లు ఉంటున్న ఆయన హస్తం పార్టీని వీడారు.
కాంగ్రెస్ పార్టీ దొంగల కంపెనీ అంటూ కోనేరు కోనప్ప చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. కేసీఆర్, బీఆర్ఎస్ను తాను ఎప్పుడూ విమర్శించలేదని వ్యాఖ్యానించారు.టికెట్ల ప్రకటనలో కేసీఆర్ గారు ముందుగా కోనేరు కోనప్ప టికెట్ నే ప్రకటించేవారు.
అయితే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటమి తర్వాత కోనప్ప బీఆర్ఎస్ ను వీడి కాంగ్రేస్ లో చేరారు.ఆ పార్టీలో ఆయనకు సరైన ప్రాథాన్యత లేకపోవడంతో తిరిగి కాంగ్రేస్ కు గుడ్ బై చెప్పినట్టు తెలుస్తుంది..తిరిగి ఆయన గులాబీ పార్టీలో చేరుతారనే వార్తలు వస్తున్నాయి..
