ఆ లాజిక్ మరిచిన “కొండా సురేఖ లాయర్”…!
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఎంతగా వివాదస్పదంగా మారాయో మనం గమనించిన సంగతి తెల్సిందే. అయితే మంత్రి కొండా సురేఖ తమ కుటుంబం గురించి అసత్య ప్రచారం చేస్తూ.. మా కుటుంబ పరువుకి భంగం కలిగే విధంగా మాట్లాడారు అనే అంశంపై అక్కినేని నాగార్జున నాంపల్లికోర్టులో వందకోట్లకు పరువునష్టం దావా కేసు వేశారు.
ఈ కేసుపై విచారణ ప్రస్తుతం కోర్టులో నడుస్తుంది. హీరో నాగార్జున.. అమల.. నాగచైతన్య నుండి కోర్టు వాంగ్మూలం తీసుకుంది. తాజాగా మంత్రి కొండా సురేఖ తరపున వాదిస్తున్న న్యాయ వాది చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె మీడియాతో మాట్లాడుతూ” మంత్రి కొండా సురేఖ ఎక్కడా కూడా వివాదస్ప వ్యాఖ్యలు చేయలేదు.. ఆమె ఎక్కడా కూడా పడుకో అని అనలేదు అని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ నడుస్తున్నాయి. బాలకృష్ణ ఓ మూవీలో చెప్పిన డైలాగ్ ” మీ నాన్నగారూ బాగున్నారా అనడానికి.. మీ అమ్మ మొగుడు బాగున్నాడా అనడానికి మధ్య చాలా తేడా ఉందన్నట్లు.. ఆమెను పంపు అనడానికి.. ఆమె పడుకో అని ప్రత్యేకంగా చెప్పడానికి పెద్ద తేడా లేదు అని సదరు న్యాయవాదికి చెప్పండ్రా అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఏది ఏమైన మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను అన్ని వర్గాల వారు ఖండించిన సంగతి మనకు తెల్సిందే.