కోహ్లీ హాఫ్ సెంచరీ.!

గత కొన్నాళ్లుగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న టీమ్ ఇండియా మాజీ కెప్టెన్..లెజండ్రీ స్టార్ బ్యాట్ మెన్ విరాట్ కోహ్లి దుబాయి వేదికగా పాకిస్థాన్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో తాజాగా ఫామ్ లోకి వచ్చారు.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచులో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. ఇది కోహ్లీకి వన్డేల్లో 74వ హాఫ్ సెంచరీ. ప్రస్తుతం భారత్ 144/2స్కోర్ గా ఉంది.
మరోవైపు విరాట్ కోహ్లి59(70)*, శ్రేయస్ 16(32)*పరుగులతో నిలకడగా ఆడుతున్నారు. భారత్ విజయానికి ఇంకా 110 పరుగులు చేయాల్సి ఉంది..