రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ..!

కేంద్ర మంత్రి…. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఆ లేఖలో కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మతలపెట్టిన ప్రభుత్వ భూముల అమ్మకాన్ని ఆపేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు.
రాజధాని మహానగరం హైద్రాబాద్ పరిధిలోని రంగారెడ్డి జిల్లా కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని వేలం ప్రక్రియను తక్షణమే నిలిపేయాలని ఆదేశించారు.ఆర్థిక వనరుల పేరిట పర్యావరణాన్ని నాశనం చేయవద్దు..
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని 400 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మకూడదు. ఆ భూమిని జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని సూచించారు. జీవ వైవిధ్యంతో కూడిన ప్రాంతాన్ని కాంక్రీట్ జంగిల్లా మార్చవద్దని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.