రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి కౌంటర్..!

Kishan Reddy Counter To CM Revanth Reddy
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి కౌంటరిచ్చారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ “సీఎం రేవంత్‌పై మరోసారి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి సహనం, అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నారు.
తెలంగాణ అభివృద్ధిపై కేంద్రంతో మాట్లాడుతున్నాను. గత ఎన్నికల్లో ప్రజలకిచ్చిన నాలుగోందల ఇరవై హామీలతో పాటు ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఆ వైపల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకే కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేస్తున్నారు.
మమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేసినంత మాత్రాన సీఎంగా రేవంత్, కాంగ్రెస్‌పై ఉన్న వ్యతిరేకత తగ్గదని హితవు పలికారు. ముఖ్యమంత్రి రేవంత్ మాటలను ప్రజలు సీరియస్‌గా తీసుకోవడంలేదు.తెలంగాణలో రూ.10 లక్షల కోట్ల పనులు చేపట్టాము.బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నానన్నది అవాస్తవం.నన్ను తిట్టిన వాళ్లను కూడా ఎప్పుడూ బెదిరించలేదు.అభివృద్ధిని అడ్డుకునే అవివేకిని కాదు అని ఆయన అన్నారు.
