మోహన్ బాబు అరెస్ట్ పై కీలక ప్రకటన…!
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. ప్రముఖ హీరో మంచు మోహాన్ బాబు ఇంట రచ్చ రోడ్డుకెక్కిన సంగతి తెల్సిందే. ఈ ఘటనలో ప్రముఖ మీడియా ఛానెల్ టీవీ9కి చెందిన జర్నలిస్ట్ రంజిత్ ను తన నివాసంలో మైకుతో దాడికి దిగడంతో తీవ్ర గాయాలై ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న ఆదివారం నటుడు మోహాన్ బాబు ఆసుపత్రికెళ్ళి క్షమాపణలు చెప్పారు.
అంతేకాకుండా ఆయనవైద్యానికి అయ్యే ఖర్చులన్నీ తాను భరిస్తానని హామీ సైతం ఇచ్చారు. ఈ క్రమంలో మోహాన్ బాబు అరెస్ట్ పై రాచకొండ సీపీ సుధీర్ బాబు కీలక ప్రకటన చేశారు. మోహాన్ బాబు ఇంట జరిగిన గొడవ విషయంలో మనోజ్,మోహాన్ బాబు పై మూడు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశాము. మోహాన్ బాబు అరెస్ట్ లో ఎలాంటి ఆలస్యం లేదు.
ఈ నెల ఇరవై నాలుగో తారీఖున తమముందు హజరవుతానని చెప్పారు. ఈ నెల ఇరవై నాలుగో తారీఖు లోపు విచారించడానికి కోర్టు అనుమతి కోరతాము.. ఇప్పటికే దీనికి సంబంధించిన నోటీసులు మోహాన్ బాబుకు పంపాము. మరోసారి పంపుతాము. అప్పటికి స్పందించకపోతే చట్టఫర చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.