త్వరలోనే నల్గోండ జిల్లా నేతలతో కేసీఆర్ భేటీ..!

KCR to meet with Nalgonda district leaders soon..!
తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ సన్నాహక సమావేశాలు, కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత , మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని మాజీ మంత్రి , సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి (భువనగిరి ), గ్యాదరి కిషోర్ కుమార్ (తుంగతుర్తి ), గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి (ఆలేరు ) శుక్రవారం ఎర్రవెల్లి లోని వారి నివాసంలో కలిశారు .ఈ సందర్భంగా పార్టీ రజతోత్సవ కార్యక్రమాల నిర్వహణ , వరంగల్ బహిరంగ సభ తదితర అంశాలపై పార్టీ అధినేత నాలుగు నియోజక వర్గాల నాయకులకు దిశా నిర్దేశం చేశారు. త్వరలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిగతా ఎనిమిది నియోజకవర్గాల ముఖ్యనాయకులతో సమావేశం ఉంటుందని పార్టీ అధినేత కేసీఆర్ తెలిపారు.