BRS దిష్టి పోయింది
తెలంగాణ లో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ కు దిష్టి పోయిందని మాజీ సీఎం.. ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు.
ఫామ్ హౌస్ లో మహబూబాబాద్, నల్గొండ పార్టీ శ్రేణులతో సమావేశమైన అయన మాట్లాడుతూ ‘కాంగ్రెస్ మోసం భరించలేక ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు.
త్వరలోనే ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు విరక్తితో ఉన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు ప్రజాదరణ కూడగట్టాలి. ఈసారి మనమే అధికారంలోకి రాబోతున్నాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.