ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కేసీఆర్ షాక్..?

బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ అధినేత..మాజీ సీఎం కేసీఆర్ బిగ్ షాక్ ఇవ్వనున్నారు.. ఈ నెలలో జరగనున్న ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇటు ఫిరాయింపు ఎమ్మెల్యేలను అటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా కేసీఆర్ తన వ్యూహాలకు పదునుపెడుతున్నారు.
సభలో ఎమ్మెల్యేల సంఖ్యా పరంగా బీఆర్ఎస్ కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానం కచ్చితంగా దక్కనున్నది.. అయితే తమ పార్టీ తరపున రెండో అభ్యర్థిని కూడా బరిలోకి దించే అంశంపై కేసీఆర్ పార్టీ నేతలతో సమాలోచనలు చేస్తున్నారు.
ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదుగురి కంటే ఎక్కువ మంది పోటీ చేస్తే ఓటింగ్ తప్పనిసరి కానుంది. దీంతో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల ఓటు కీలకం కానుంది. వీరిని ఇరుకున పెట్టాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు.
