KCR భావోధ్వేగం
తెలంగాణ భవన్ లో జరిగిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో గులాబీ దళపతి….మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర భావోధ్వేగానికి గురయ్యారు. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ నేను అగ్నిపర్వతంలా ఉన్నాను.. కానీ సొంత బిడ్డను అరెస్ట్ చేసి జైల్లో పెడితే నాకు బాధగా ఉండదా..?..
ఎమ్మెల్యేలు అంతా పార్టీ వీడిన బాధపడాల్సినవసరం లేదు.. ఇంతకంటే దారుణమైన పరిస్థితుల్లో నుండి మనం అధికారంలోకి వచ్చాము.. అసలు లేదనుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. పదేండ్లు ఎన్నో సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేశాము..
కొన్ని కొన్ని కారణాల వల్ల ఓడిపోయాము.. మనపై ప్రజలకు పదేండ్ల తర్వాత వ్యతిరేకత వచ్చింది.. కానీ కాంగ్రెస్ పై ఏడు నెలలకే వచ్చింది.. ప్రజలంతా అన్ని గమనిస్తున్నారు అని అన్నారు.