కేసీఆర్..బాబు రాజకీయ పుట్టుక కాంగ్రెస్..!

గాంధీభవన్ లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులుగా జక్కిడి శివచరణ్ రెడ్డి.. ఉపాధ్యక్షులుగా మిట్టపల్లి వెంకటేష్ పదవీ బాధ్యతలు స్వీకరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గోన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” యూత్ పవర్ ఏంటో మాకు తెల్సు. యూత్ కాంగ్రెస్ లో పని చేసినవాళ్లంతా ఉన్నత స్థాయికెదిగారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభకెళ్ళారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన కేసీఆర్.. ఏపీ ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు ముందుగాల యూత్ కాంగ్రెస్ లో పని చేసినవాళ్ళే.
మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలన్న ప్రజల ఆకాంక్ష మేరకు యూత్ కాంగ్రెస్ పని చేశారు. పార్టీకోసం కష్టపడిన యూత్ ను కాపాడుకుటాము. అన్ని రకాలుగా వాళ్లకు అండగా ఉంటాము.. సమయం వస్తే అందరికీ అవకాశాలు వస్తాయి. పోరాటతత్వాన్ని వదిలిపెట్టోద్దు అని అన్నారు.
