కవిత అరెస్ట్ బీజేపీకి కల్సివచ్చిందా..?
తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఇప్పటివరకు ఎనిమిది స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న సంగతి తెల్సిందే.
అయితే దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ బీజేపీ కలిసి వచ్చిందా? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
కవిత అరెస్టుతో బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటి కాదని సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి. దీనికితోడు ప్రధానమంత్రి నరేందర్ మోదీ ప్రచారం ఆ పార్టీకి బూస్ట్ ఇచ్చింది.
తెలంగాణ రాష్ట్రంలో గత పార్లమెంట్ ఎన్నికల్లో 4 స్థానాల్లో గెలిచిన బీజేపీ ఈసారి ఏకంగా 8 స్థానాల్లో ఆధిక్యం దిశగా కొనసాగుతోంది.
అయోధ్య రామమందిరం నిర్మాణం సెంటిమెంట్, నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామనే హామీ పనిచేసినట్లు చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.