బీఆర్ఎస్ పై మేయర్ సునీల్ రావు సంచలన వ్యాఖ్యలు
కేంద్రహోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ సమక్షంలో కరీంనగర్ మున్సిపాలిటీ మేయర్..బీఆర్ఎస్ నేత సునీల్ రావు పదిమంది కౌన్సిలర్లతో కల్సి బీజేపీలో చేరిన సంగతి తెల్సిందే.. ఈ సందర్భంగా మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ “కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు..
కరీంనగర్ జిల్లాలో జరిగిన ప్రతీ స్కామ్ వెనక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాత్ర ఉంది.బ్యాంకాక్, శ్రీలంకలో పేకాట ఆడే సంస్కృతి గంగులది.చెక్‌డ్యామ్,రోడ్డు కాంట్రాక్టర్లంతా గంగుల బినామీలే..
గంగుల అవినీతి బయట పెడతాను అని మేయర్ సునీల్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు..కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్, కేంద్రం కృషితోనే కరీంనగర్ అభివృద్ధి ,నగర అభివృద్ధి ఆగిపోవద్దని ఇంతకాలం సైలెంట్‌గా ఉన్నాను.నేను ఏ విచారణకైనా సిద్ధమని ప్రకటించారు..