కరీంనగర్ అంటేనే ఉద్యమాలకు కేరాఫ్ అడ్రస్..!
కరీంనగర్ అంటేనే ఉద్యమాలకు కేరాఫ్ అడ్రస్ . నాడు కరీంనగర్ సభలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణను ఇచ్చిన పార్టీ కాంగ్రెస్. ఇచ్చిన మాటను నెరవేర్చడానికి ఎంతదూరమైన వెళ్ళే నాయకురాలు సోనియా గాంధీ.. గత పాలకులు వేములవాడ అభివృద్ధిని పట్టించుకోలేదు. వేముల వాడ్ అభివృద్ధికి ఈరోజు శ్రీకారం చుట్టుకున్నాము. కరీంనగర్ నుండి రెండు సార్లు ఎంపీగా గెలిచిన ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు.
పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ వేముల వాడ ఆలయ అభివృద్ధికి ఆరు పైసలు కూడా చెల్లించలేదు. గతంలో ఎమ్మెల్యేను కలవాలంటే జర్మనీ పోవాలి. కానీ ఈరోజు ఎమ్మెల్యే ఆది శ్రీనన్నే మీదగ్గరకు. మీ గల్లీలోకి వస్తాడు. ఆది శ్రీనన్న నాదగ్గరకు వస్తుంటే భయమేస్తుంది. ఏ పని అడుగుతాడో.. ఏ ప్రాజెక్టు అడుగుతాడో అని. పదకొండు నెలల్లో వందల సార్లు వచ్చిన ఏ రోజు కూడా తనకోసం ఏపని అడగలేదు.
కేవలం వేముల వాడలో రోడ్లు అడిగాడు. ప్రాజెక్టులు అడిగాడు. ఆలయం అభివృద్ధికోసమే నిధులు అడిగాడు. ఇలాంటి నాయకుడు ఉండటం మీ అదృష్టం. నాకు ప్రాంతానికి నమ్ముకున్న ప్రజలకు ఏదైన చేయాలని ఉంది. ఎవరూ అడ్డుపడిన్ కానీ అభివృద్ధి ఆగదు. కేసీఆర్ పదేండ్లలో ఎన్నిసార్లు వేముల వాడకు వచ్చారు. ఎన్నికల సమయంలో తప్పా ఎప్పుడు బయటకు రాడు అని ఆయన అన్నారు.