నేడే కనుమ.. ప్రత్యేకతలివే..!
మూడు రోజుల సంక్రాంతి వేడుకల్లో ఈరోజు బుధవారం కీలకమైనది కనుమ. వ్యవసాయంలో చేదోడువాదోడుగా ఉండే పశువులను కనుమ రోజున ఆలకంరించి ప్రత్యేకంగా పూజలు చేయడం అనవాయితీ. ఏడాదంతా శ్రమించే వాటికి రైతులు ఇచ్చే గౌరవం ఇది.
అలాగే కనుమ నాడు మినపవడలు, నాటుకోడి పులుసుతో భోజనం తప్పనిసరిగా తయారు చేసుకుంటారు. కనుమ రోజు కాకులు కూడా కదలవని నానుడి ఉంది.
అందుకే పండక్కి వచ్చిన వారు కనుమ రోజు తిరుగు ప్రయాణం చేయకూడదని అంటుంటారు. మూడు రోజుల పండుగను ఆస్వాదించిన తర్వాతే తిరిగి వెళ్లాలనేది సంప్రదాయం.