మహారాష్ట్ర లో కాంగ్రెస్ కూటమి ఓటమిపై కంగనా సంచలన వ్యాఖ్యలు
 
			                Kangana’s sensational comments on the defeat of the Congress alliance in Maharashtra
 
శనివారం విడుదలైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 233స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే. మరోవైపు విపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ కూటమి కేవలం 51 స్థానాల్లోనే విజయభేరి మ్రోగించింది.
ఈ విషయం గురించి ప్రముఖ నటి.. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మట్లాడుతూ మహారాష్ట్రలో మహిళలను అగౌరవపరిచినందుకే మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ఓటమి పాలైందని ఆరోపించారు. ఉద్ధవ్ ఠాక్రే దారుణమైన పరాజయాన్ని పొందుతారని తాను ముందే ఊహించినట్లు తెలిపారు.
ముంబైలోని తన నివాసాన్ని కూల్చివేసి దూషించినట్లు పేర్కొన్నారు. దేశ విచ్ఛిన్నం గురించి మాట్లాడిన వారికి మహా ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని ఆమె దుయ్యబట్టారు.
 
                             
                                     
                                    