మెండిస్ శతకం

 మెండిస్ శతకం

Kamindu Mendis Century

Loading

న్యూజీలాండ్ తో బుధవారం నుండి ప్రారంభమైన మొదటి టెస్ట్ మ్యాచ్ తొలిరోజు మొదటి ఇన్నింగ్స్ లో శ్రీలంక ఏడు వికెట్లను కోల్పోయి 302 పరుగులు చేసింది. ఓపెనర్లు దిముత్ కరుణ రత్నే (2), నిసాంకా (27) జట్టుకు శుభారంభం అందించలేకపోయారు.

దినేశ్ చండీమల్ (30), కెప్టెన్ ధనంజయ్ డిసిల్వా (11) సైతం జట్టుకు అండగా ఉండలేకపోయారు. దీంతో నాలుగు వికెట్లకు లంక 106పరుగులను మాత్రమే చేసింది. ఈదశలో కమిందు మెండిస్ అద్భుత బ్యాటింగ్ తో జట్టును ఆదుకున్నాడు.

కివీస్ బౌలర్లను ఎదుర్కుని మెండిస్ పదకొండు ఫోర్లతో 114పరుగులు చేశాడు. ఇక కుశాల్ మెండిస్ (50) కూడా దాటిగా ఆడి జట్టుకు తనవంతు సాయం అందించాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో విలియమ్ మూడు, ఫిలిప్స్ రెండు వికెట్లను పడగొట్టారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *