50కోట్ల క్లబ్ లో ‘క’ మూవీ..!
యువహీరో కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన తాజా మూవీ క. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మంచి హిట్ టాక్ తో కలెక్షన్ల సునామీని క్రియేట్ చేసింది.
వరల్డ్ వైడ్ గా విడుదలైన ఈ మూవీ యాబై కోట్ల క్లబ్ లో చేరిందని మేకర్స్ ప్రకటించారు. హీరో కిరణ్ అబ్బవరం కేరీర్ లోనే అతి ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన మూవీగా రికార్డులకెక్కింది.
మరోవైపు ఈ సినిమా మలయాళంలో కూడా విడుదల చేయనున్నారు. దీనిని మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన వేఫరర్ ఫిలింస్ బ్యానర్ పై విడుదల చేయనున్నారు.